“నేను ఐపీఎల్‌తో పాటు కర్ణాటకకు ఆడే సమయంలోనూ వికెట్ కీపింగ్ చేస్తున్నా. కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అయితే టీమ్ఇండియా కోసం వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు కాస్త టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి బంతిని పట్టడంలో తడబడినా.. నువ్వు ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవన్నట్టు ప్రజలు ఫీలవుతారు. దిగ్గజ వికెట్ కీపర్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. వికెట్ల వెనుక ప్రస్తుతం మహీ తప్ప ఎవరు ఉన్నా ప్రజలు పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదు” అని కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక చేయడంలో ఐపీఎల్లో ప్రదర్శన కూడా కీలకమయ్యే అవకాశం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. కాగా కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
‘చిన్న తప్పుదొర్లినా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవంటారు’