16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనుంది. ఇవాళ ఉదయం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ను రాజ్‌భవన్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ కలిశారు. ఆప్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కేజ్రీవాల్‌ కోరారు. 15 నిమిషాల పాటు రాజ్‌భవన్‌లో కేజ్రీవాల్‌ ఉన్నారు. రాజ్‌భవన్‌ను తన నివాసానికి తిరిగి వచ్చిన కేజ్రీవాల్‌ను కలిసేందుకు నూతన ఎమ్మెల్యేలు తరలివస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు.